భారతదేశం, ఏప్రిల్ 24 -- Prakash Raj: ప్రకాష్ రాజ్ శ్రీరాముడిపై చేసిన కామెంట్స్, వాటిపై విమర్శలు, కేసుల నేపథ్యంలో బీజేపీ నేత మహేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ ఎక్కడ కనిపించినా నరకాలని పిలుపునివ్వడం గమనార్హం. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఒక బహిరంగ వీడియో సందేశంలో బీజేపీ నేత మహేందర్ రెడ్డి ఈ విపరీత వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ నిరంతరం హిందూ దేవతలను, సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.

"ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు హిందూ సమాజానికి తీరని ద్రోహం చేస్తున్నారు. ఆయన మాటలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. నాస్తికుడు అని చెప్పే ప్రకాష్ రాజ్.. తన తల్లి అంత్యక్రియలను క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం చేశాడు. మరి హిందూ దేవుళ్లపై ఎలా నోరు పారేసుకుంటాడు. ఒకప్ప...