భారతదేశం, జూన్ 14 -- Prakash Raj: వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. అతను చేసిన ఘాటు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం, పరీక్షల నిర్వహణలో అక్రమాలపై బెంగళూరులో ఆదివారం (జూన్ 14) 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (CJP) భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇందులో ప్రకాష్ రాజ్ పాల్గొన్నాడు.

​ఈ నిరసన ప్రదర్శనకు సంబంధించిన ఓ వీడియోను 'కాక్‌రోచ్ ఈజ్ బ్యాక్' అధికారిక సోషల్ మీడియా (X) ఖాతాలో పంచుకున్నారు. ప్రసిద్ధ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేతో కలిసి ప్రకాష్ రాజ్ ఈ వేదికపై మాట్లాడాడు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని, నాయకత్వాన్ని ఆయన తీవ్రస్థాయిలో ఎండగట్టాడు.

​"ప్రజలు ఎన్నుకున్న నాయకులు తమ పని తాము సరిగ్గా...