భారతదేశం, ఏప్రిల్ 2 -- ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తల్లి స్వర్ణలత (86) ఇటీవల వయోభారంతో తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె నమ్మకాలకు అనుగుణంగా మంగళవారం బెంగళూరులోని సెయింట్ మైఖేల్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే రోజూ సామాజిక, రాజకీయ అంశాలపై గళమెత్తే ప్రకాష్ రాజ్ నాస్తికుడన్న విషయం అందరికీ తెలిసిందే.

తాను దేవుడిని నమ్మనని చెప్పే వ్యక్తి, తన తల్లికి మతపరమైన అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. దీనిపై ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు.

ఒక నెటిజన్ ప్రకాష్ రాజ్ పాత ఇంటర్వ్యూను, అతని తల్లి అంత్యక్రియల వీడియోను కలిపి పోస్ట్ చేస్తూ విమర్శలకు దిగారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. "నాకు దేవుడిపై నమ్మకం లేదు. ఆ ఆలోచనలకు నా ...