భారతదేశం, ఆగస్టు 5 -- Pradeep Rawat: సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలివేట్ కావాలంటే, బొమ్మ బ్లాక్ బస్టర్ గా నిలవాలంటే బలమైన విలన్ కావాలి. అలాంటి విలన్ క్యారెక్టర్లకు పర్యాయ పదమే 'ప్రదీప్ రావత్'. తన రూపంతో, నటనతో వెండి తెరపై భయాన్ని పుట్టించిన విలన్ ఆయన. హార్ట్ అటాక్ తో కన్నుమూసిన ప్రదీప్ రావత్ విలన్ గా చూపించిన ఇంపాక్ట్ ఎప్పటికీ పదిలంగా నిలిచిపోతుంది.

హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తనదైన నటనతో విలన్ పాత్రలకు సరికొత్త నిర్వచనం చెప్పారు ప్రదీప్ రావత్ (Pradeep Rawat). గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1995 నుంచి వెండితెరపై విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన ముద్ర అసాధారణం.

దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాల్లో విలన్లను బాగా చూపిస్తారనే టాక...