Pradeep Rawat: తీవ్ర విషాదం.. ప్రదీప్ రావత్ కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడుతూ కన్ను మూసిన 'సై' విలన్
భారతదేశం, ఆగస్టు 4 -- Pradeep Rawat: భారతీయ సినీ రంగాన్ని తన విలనిజంతో దశాబ్దాల పాటు భయపెట్టిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. 'గజినీ' (Ghajini) లో భయంకరమైన టైటిల్ రోల్, 'సై' (Sye) లో భిక్షు యాదవ్‌గా ఐకానిక్ విలనిజం పండించిన ఆయన 74 ఏళ్ల వయసులో ముంబైలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ప్రదీప్ రావత్ మేనేజర్ సిద్ధార్థ్ తివారీ ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. "ఆయన గతంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడి కోలుకున్నారు. ఇటీవల అది మళ్లీ తిరగబెట్టడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. గత నెల రోజులుగా ముంబైలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన కొద్ది గంటల క్రితమే కన్నుమూశారు" అని తెలిపారు.
ప్రదీప్ రావత్‌కు భార్య, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.