భారతదేశం, ఆగస్టు 14 -- Prabhas Spirit: హను రాఘవపూడి డైరెక్షన్‌లో వస్తున్న 'ఫౌజీ' షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్న రెబెల్ స్టార్ ప్రభాస్.. వెంటనే తన తదుపరి భారీ ప్రాజెక్ట్ 'స్పిరిట్' కోసం రెడీ అవుతున్నారు. ఈ పవర్‌ఫుల్ పోలీస్ డ్రామా కోసం ప్రభాస్ పూర్తి బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ అవ్వబోతున్నారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డిజైన్ చేసిన ఇంటెన్స్ క్యారెక్టర్ కోసం డెడికేటెడ్ ఫిట్‌నెస్ డైట్ ఫాలో కానున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ ఒకే సమయంలో పీరియాడిక్ వార్ డ్రామా 'ఫౌజీ', సందీప్ వంగా 'స్పిరిట్' కోసం వర్క్ బ్యాలెన్స్ చేస్తున్నారు. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ'లో 1940ల కాలం నాటి ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయిన వెంటనే ప్రభాస్ తన బాడీ లాంగ్వేజ్, హెయిర్‌స్టైల్ పూర్తిగా మార్చే...