భారతదేశం, జూన్ 20 -- Prabhas Sing Geetham: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో అత్యంత భారీగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్యూర్ కల్ట్ క్లాసిక్ మూవీ 'సింగ్ గీతం' బాక్సాఫీస్ వద్ద ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇదొక అద్భుతమైన మాస్టర్‌పీస్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా పాజిటివ్ మౌత్ టాక్ వ్యాపించేలా చేస్తున్నారు.

అయితే ఈ రేంజ్ ప్రశంసలు వస్తున్నప్పటికీ, అది థియేటర్ల వద్ద కలెక్షన్ల రూపంలో మాత్రం మారడం లేదు. దీంతో సినిమాకు భారీ హైప్ తెచ్చేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ ఊహించని విధంగా రంగంలోకి దిగారు.

సాధారణంగా టాలీవుడ్‌లో ప్రతి వారం అరడజనుకు పైగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ వారం కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్లలోకి రావడంతో సహజంగానే ప్రేక్షకుల అటెన్షన్ వేరే సినిమాల వైపు మళ్లింది. 'సింగ్ గీతం' సి...