భారతదేశం, అక్టోబర్ 23 -- Prabhas Birthday: భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ క్రేజ్, వేలకోట్ల బాక్సాఫీస్ స్టామినా కలిగిన డార్లింగ్, రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఈరోజు (అక్టోబర్ 23) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పాన్-ఇండియా సూపర్ స్టార్ బర్త్‌డే కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పండుగ వాతావరణాన్ని సృష్టించారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రభాస్.. తన ఆత్మీయులు, కుటుంబ సభ్యుల మధ్య అత్యంత సాధారణంగా ఈ వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభాస్ సినిమాలకు సంబంధించిన భారీ అప్‌డేట్‌లతో పాటు, ఆయనకు సంబంధించిన ఒక అరుదైన ఫోటో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న 'ఫౌజీ' చిత్రం నుంచి స్పెషల్ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్, అలాగే 'కల్కి 2' సెట్స్‌లోకి ప్రభ...