భారతదేశం, అక్టోబర్ 19 -- Prabhas: 2026లో ప్రభాస్ హీరోగా నటించిన రెండో సినిమా కూడా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఫౌజీ మూవీని డిసెంబర్ 4న రిలీజ్ చేస్తామని ముందు మేకర్స్ ప్రకటించారు. దీంతో రెబల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. కానీ ఈ మూవీ రిలీజ్ ను వాయిదా వేశారు. ఇక తాజాగా స్పిరిట్ రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పోన్ అయింది.

ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే 2027లో రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ రచ్చ పీక్స్ కు చేరేలా కనిపిస్తోంది. హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేస్తున్న ఫౌజీ మూవీ మార్చిలో రిలీజ్ అయ్యే అవకాశముంది. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ ఏమో అక్టోబర్ 29న థియేటర్లకు రాబోతుంది.

2027లో ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ల వెనుక మేకర్స్ పెద్ద ప్లాన్ వేసినట్లే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఫౌజీ మూవీని మార్...