భారతదేశం, ఆగస్టు 8 -- Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. క్రేజీ ప్రాజెక్ట్‌లతో అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చేందుకు డార్లింగ్ నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ ను జెట్ స్పీడ్ తో ముందుకు తీసుకెళ్తున్నాడు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్‌కు మేకర్స్ తాత్కాలికంగా దాదాపు ఒక నెల రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. స్పిరిట్ షూటింగ్ దక్కిన ఈ విరామాన్ని హను రాఘవపూడి, 'ఫౌజీ' టీమ్ తమకు అనుకూలంగా మార్చుకుంది.

ప్రభాస్ డేట్స్ వేస్ట్ కాకుండా చూసుకుంటూ, 'ఫౌజీ' చిత్రీకరణను జెట్ స్పీడ్‌లో పూర్తి చేయడానికి ఈ నెల రోజుల గ్యాప్‌ను ఫుల్‌గా ఉపయోగించుకుంటున్నారు.

ఫౌజీ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు దర్శకుడు హను రాఘవపూడి ...