భారతదేశం, ఏప్రిల్ 9 -- ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ 2 అదరగొడుతోంది. ఇప్పటికే రూ.1600 కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ మూవీ చూశాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి అల్లు సినిమాస్ లో సినిమా వీక్షించాడు.

సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలిసి అల్లు సినిమాస్ లో ధురంధర్ 2 చూడటం వైరల్ గా మారింది. వీళ్లకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అల్లు సినిమాస్ లోకి ప్రభాస్ వెళ్లడం, మూవీ చూడటం, అక్కడి నుంచి బయటకు రావడం.. ఇలా వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతు...