భారతదేశం, ఏప్రిల్ 1 -- వివాదాలకు కేరాఫ్ అడ్రస్, మోడల్, నటి పూనమ్ పాండే ఇంటర్నెట్‌లో పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది. గతంలో సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్)పై అవగాహన కల్పించేందుకంటూ తన మరణం గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేసిన ఆమె.. ఇప్పుడు 'ప్రెగ్నెన్సీ' పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'బేబీ బంప్'తో ఉన్న ఫోటోలను షేర్ చేసి నెటిజన్లను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. అయితే ఆమె ట్రాక్ రికార్డు తెలిసిన నెటిజన్లు ఇది నిజమా లేక మరో గారడీనా అని సందేహాలు వ్యక్తం చేశారు. ఊహించినట్లుగానే ఇది కేవలం ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అని పూనమ్ స్వయంగా వెల్లడించింది.

పూనమ్ పాండే షేర్ చేసిన ఫోటోలలో ఆమె తన బేబీ బంప్‌ను చూపిస్తూ కెమెరాకు నవ్వుతూ ఫోజులిచ్చింది. ఒక ఫోటోలో టీ-షర్ట్ పైకి రోల్ చేసి...