భారతదేశం, అక్టోబర్ 15 -- Poonam Kaur: టాలీవుడ్‌లో మరోసారి వివాదాల సెగలు రేపుతోంది నటి పూనమ్ కౌర్ (Poonam Kaur). సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఇండస్ట్రీలోని లోపాలను ఎండగట్టే పూనమ్, ఈసారి నేరుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) టార్గెట్‌గా ఇవాళ (అక్టోబర్ 15) ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో పెట్టిన పోస్టులు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

పూనమ్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ స్టైల్‌ను ఎండగట్టింది. ఒకప్పుడు త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించే క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్, పంచ్ డైలాగులు, మునుపటి ఫన్ ఇప్పుడు ఆయనలో అస్సలు కనిపించడం లేదని పూనమ్ ఘాటుగా ట్రోల్ చేసింది. త్రివిక్రమ్ కేవలం ఒక బ్రాండ్‌గా మారిపోయారే తప్ప, కంటెంట్‌లో పస తగ్గిందంటూ ఇన్ డైరెక్ట్‌గా సెటైర్లు ...