భారతదేశం, సెప్టెంబర్ 2 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ కాస్త ఎమోషనల్ గా, మరికాస్త ఫన్నీగా సాగిపోయింది. తన కొత్త లవర్ గోపిక సోషల్ మీడియా ప్రొఫైల్ దొరికిందంటూ మహాను ఉడికించాలని చక్రి ప్రయత్నిస్తాడు. కానీ అది కాస్తా రివర్స్ అవుతుంది. అటు తన పెళ్లి విషయంలో డైలమాలో ఉన్న పెద్ది.. ధైర్యం చేసి పెళ్లి చూపులకు రెడీ అవుతాడు. కానీ అక్కడే పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది.

తన చెల్లెలు మహాలక్ష్మి కట్టిన రాఖీని ఆది విసిరి కొట్టే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 2) ఎపిసోడ్ మొదలైంది. మహా ఎంతో ప్రేమగా రాఖీ కట్టినా.. డబ్బు విసిరి మీ మందకు నెలంతా భోజనం పెట్టు అని అవమానించేలా మాట్లాడతాడు ఆది. దీంతో మహా ఆవేశంతో అతన్ని తిడుతుంది. నువ్వు మారవు.. ఛీ అంటూ చక్రిని తీసుకొని వెళ్లిపోతుంది. అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి కావడ...