భారతదేశం, సెప్టెంబర్ 17 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో మాధవ నిశ్చితార్థం రద్దవడంతో చక్రి అండ్ ఫ్యామిలీ ఆనందంతో గంతులేస్తారు. కానీ తమ్ముళ్లే ఈ పని చేశారని బాధపడిన మాధవ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. అయితే అక్కడే అతనికి కొత్త జీవితం దొరుకుతుంది. మరోవైపు కేశవపై శైలుకి వరాలు లేనిపోనివి నూరిపోస్తుంది.

నిశ్చితార్థం రద్దయినందుకు తాయారు రచ్చ చేసే సీన్ తో సీరియల్ గురువారం (సెప్టెంబర్ 17) ఎపిసోడ్ మొదలైంది. అయితే అది మా అక్క ఇష్టం అని శశి పాల్ అనడంతో చక్రి ఎంట్రీ ఇస్తాడు. అతన్ని దగ్గరికి పిలిచి చెంప చెల్లుమనిపిస్తాడు. నిన్న కొట్టడానికి చాలా సేపటి నుంచి చూస్తున్నాను.. సరిగ్గా దొరికావని అంటాడు. ఆ తర్వాత నారాయణ, కన్నా కూడా శశిపాల్ ను కొడతామని ఉత్సాహం చూపిస్తే తాయారు తిడుతుంది.

వాళ్లు చివరి నిమిషంలో నిశ్చిత...