భారతదేశం, సెప్టెంబర్ 11 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ కూడా మాధవ నిశ్చితార్థం చుట్టూ తిరిగింది. గత కొన్ని ఎపిసోడ్లుగా సాగదీస్తూనే ఉన్న ఈ నిశ్చితార్థం తాజా ఎపిసోడ్ లోనూ ఇంకా పూర్తి కాలేదు. జయంతి మాజీ భర్త ఎంట్రీ, తాయారా శాపనార్థాలు, మనీషా సెంటిమెంట్ సీన్లతో సాగిపోయింది.

నిశ్చితార్థం కోసం అమ్మాయి ఇంటికి వచ్చి బయటే కాళ్లు కడుక్కోవడానికి నీళ్ల కోసం నారాయణ పట్టుబట్టే సీన్ తో సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ మొదలైంది. జయంతి తమ్ముడు శశిపాల్ కు క్లాస్ పీకి మరీ అతనితో నీళ్లు తెప్పించుకొని కాళ్లు కడుక్కుంటాడు నారాయణ.

మర్యాద తెలియదంటూ తిడతాడు. జయంతి నాన్ని కలగజేసుకొని నారాయణకు సర్ది చెబుతాడు. ఏదో రకంగా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలని బలంగా డిసైడైనట్లున్నాడు అని మహాతో అంటాడు చక్రి. ఇంతదాకా వచ్చాక ఇ...