భారతదేశం, అక్టోబర్ 2 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో చక్రితో ఇంట్లో వాళ్లు ఆడుకోవడం, గోపిక ఆత్మహత్య చేసుకోకుండా మహా అడ్డుకోవడం చుట్టూ తిరిగింది. నిజంగానే మహా ఎక్కడ తనకు దూరమై గోపికను ఇచ్చి పెళ్లి చేస్తారో అని చక్రి టెన్షన్ పడటం ఈ ఎపిసోడ్ లో హైలైట్ గా చెప్పొచ్చు.

గోపికను తీసుకొస్తానని మహా వెళ్లడంతో చక్రి ఏం జరుగుతుందో అని ఆందోళన పడే సీన్ తో సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 2) ఎపిసోడ్ మొదలైంది. అదే అదునుగా నారాయణ, కేశవ, మాధవ అతనితో ఆడుకుంటారు. మాధవ అన్ని రకాలుగా యోగ్యుడైనా కూడా వాడికి ఒక్క పెళ్లి జరగలేదు.. నీకు మాత్రం రెండేసి పెళ్లిళ్లు జరుగుతున్నాయి అని నారాయణ వెటకారంగా అంటాడు. అసలు ప్రపంచంలో ఓ పెళ్లామే వెళ్లి చేసే పెళ్లి ఇప్పుడే చూస్తున్నానని అని వెళ్లిపోతాడు.

ఆ తర్వాత మాధవ, కేశవ కూడా చక్రితో ఆ...