భారతదేశం, అక్టోబర్ 16 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ బృందావనంలో అన్నదమ్ముల ప్రేమలు, ఆప్యాయతలను మరోసారి కళ్లకు కట్టడంతోపాటు జమున దొంగ బుద్ధిని కూడా కళ్లకు కట్టింది. అయితే ఎపిసోడ్ చివర్లో జమున రెండో భర్త ఏకంగా ఇంటికే రావడం, నారాయణ అతన్ని కొట్టడానికి వెళ్లడం కూడా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.

జమునతో ఏం చెప్పారని మహాను చక్రి అడిగే సీన్ తో సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 16) ఎపిసోడ్ మొదలైంది. మాధవ కంటే ముందే ఎందుకు పెళ్లి చేసుకున్నారని అడిగితే తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పానని మహా అంటుంది. దీంతో చక్రి తెగ మురిసిపోతాడు. మీరు మారిపోయారు అని అంటాడు. అంతగా మురిసిపోకు ఆమె సడెన్ గా అడిగేసరికి అలా చెప్పానని మహా అంటుంది.

ఇప్పుడు వెళ్లి అదంతా అబద్ధం.. మేము పెళ్లి చేసుకోలేదు.. అయినా ఇప్పుడు విడాకులు తీస...