భారతదేశం, అక్టోబర్ 14 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో కేశవ కోసం మాధవ, చక్రి డబ్బు కూడబెట్టే ప్రయత్నంలో ఉండగా.. అటు జమున మాత్రం రెండో భర్త అప్పుల కోసం ఇంట్లో డబ్బు దొంగతనం చేయాలని చూస్తూ ఉంటుంది. కన్న కొడుకు ఇచ్చిన గిఫ్ట్ ను కూడా ఆమె లైట్ తీసుకుంటుంది. అయితే చివరికి మహాకు దొరికిపోతుంది.

చక్రికి మహా ఫోన్ చేసే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 14) ఎపిసోడ్ మొదలైంది. భోజనం చేశావా అని భార్య అడగడంతో చక్రి తెగ సంతోషపడతాడు. ఇంకా తినలేదని చెప్పడంతో మహా క్లాస్ పీకుతుంది. టైమ్ రెండున్నర అవుతున్నా ఎందుకు తినలేదని అడుగుతుంది. తన ఆరోగ్యం కోసం ఎంత టెన్షన్ పడుతుందో అని చక్రి మనసులో మురిసిపోతాడు. కానీ అసలు విషయం తెలిసి షాక్ తింటాడు.

మీరు భోజనం చేయడానికి ఇంటికి వెళ్తారు కదా.. అసలు ఆ సుపుత్ర ఆమెతో ఎలా ఉన్నాడో...