భారతదేశం, నవంబర్ 3 -- Pocket Rockkets Teaser: నిహారిక కొణిదెల తెలుగులో మరో క్రేజీ కామెడీ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'పాకెట్ రాకెట్స్' (Pocket Rockets).

'కమిటీ కుర్రోళ్లు' ఫేమ్ త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ కథానాయకులుగా, 'శుభం' ఫేమ్ శ్రియా కొంతం కథానాయికగా రూపొందుతోన్న ఈ మూవీ నుంచి మంగళవారం (నవంబర్ 3) 'ది ఫస్ట్ హ్యాండ్' (The First Hand) పేరిట టీజర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

క్యాసినోలకు ఇండియాలో గోవా ఎలా పాపులరో శ్రీలంక కూడా అంతే ఫేమస్. అలాంటి శ్రీలంక క్యాసినో నేపథ్యంలో సాగే మూవీయే ఈ పాకెట్ రాకెట్స్. "ఈ ఫీలింగ్ ఏంట్రా ఇలా ఉంది.. జీవితంలో తొలిసారి కల...