భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఒక్కో మనిషి వ్యక్తిత్వం తీరు ఒక విధంగా ఉంటుంది. మనం మాట్లాడే మాటలు, మన చేతలు, మన చేతిరాత, మన పేరులో మొదటి అక్షరం, పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం, రాశులు ఆధారంగా కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే పాదాలను బట్టి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. పాదాలు, కాలివేళ్లు మనకు తెలియని ఎన్నో విషయాలను చెబుతాయి.

ఒక్కో వ్యక్తి తీరు, ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. కొంత మందికి అవి బలాలు అయితే, కొంత మందికి అవి బలహీనతలు అవవచ్చు. అయితే ఇక్కడ ఈరోజు పాదాల రూపురేఖలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. పాదాలను బట్టి మీరు ఎలా ఉంటారో తెలుసుకోవచ్చు. మరి మీరు ఎలాంటి వారో ఇప్పుడే తెలుసుకోండి.

పాదాలు వెడల్పుగా ఉన్నట్లయితే వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. అదే పాదాలు సన్నగా ఉంటే ఇతరులకు వారి పనులను అప్పగించడానికి ఇష్టపడతారు. పాదం మధ...