భారతదేశం, మే 19 -- Peddi Trailer: బాక్సాఫీస్ ను షేక్ చేసే ముందు.. వసూళ్ల రికార్డులు తిరగరాయడానికి ముందు.. పెద్ది మూవీ ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. చరణ్ విశ్వరూపాన్ని కళ్లకు కట్టిన ఈ పెద్ది ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో పెద్ది ఒకటి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల కోసం సినీ లవర్స్, మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వీళ్లందరికీ అసలు ట్రీట్ కంటే ముందు స్టార్టర్స్ వడ్డించినట్లు పెద్ది ట్రైలర్ తో పండుగ షురూ మేశారు మేకర్స్.

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది మూవీ ట్రైలర్ ను సోమవారం (మే 18) మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి సాయంత్రం 4.05 గంటలకు ట...