భారతదేశం, జూన్ 2 -- Peddi Ticket Price Hike: మెగా ఫ్యాన్స్, టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లీగల్ అప్‌డేట్ వచ్చేసింది. రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన 'పెద్ది' సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు సంబంధించి టికెట్ రేట్ల పెంపు ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అఫీషియల్ జీవో (GO) కాపీ కూడా త్వరలోనే బయటకు రానుంది.

తెలంగాణలో 'పెద్ది' చిత్రానికి స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ వేసుకోవడానికి రేవంత్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ స్పెషల్ ప్రీమియర్ షోల టికెట్ ధరను గరిష్ఠంగా రూ. 600గా ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రీమియర్లకు కేవలం ఒక్క షోకు మాత్రమే అనుమతి దక్కింది.

సినిమా రిలీజైన ఫస్ట్ డే నుంచి వేసే రెగ్యులర్ షోల కోసం మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లలో రేట్లను...