భారతదేశం, మార్చి 3 -- రామ్ చరణ్ డ్యాన్స్ లో ఉండే గ్రేస్, పవర్ తెలిసిందే. మరోసారి తన డ్యాన్స్ తో చెర్రీ కుమ్మేశాడు. పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. అతని అప్ కమింగ్ మూవీ పెద్ది నుంచి రిలీజైన రై రై రా రా సాంగ్ లో మాస్ గెటప్ లో రామ్ చరణ్ డ్యాన్స్ మరో లెవల్ అన్నట్లు ఉంది. ఇక వాయిస్ తో ఏఆర్ రెహమాన్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడు.

బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ 'రై రై రా రా' రిలీజైంది. ఈ పాటతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. పవర్ ఫుల్ లిరిక్స్, రామ్ చరణ్ పవర్ మూవ్స్ తో రై రై రా రా సాంగ్ రచ్చ చేస్తోంది.

పెద్ది మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన 'చికిరి' సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు రై రై రా రా అంటూ సాగ...