భారతదేశం, జూన్ 14 -- Peddi New Scenes Added: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద రూ. 378 కోట్ల కలెక్షన్లతో ఊచకోత కోస్తోంది. అయితే, ఈ భారీ సక్సెస్ మధ్యే హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్ర చిత్రణపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ చర్చలకు చెక్ పెట్టేందుకు దర్శకుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు.

పెద్ది మూవీలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై తీవ్రమైన విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. హీరోయిన్ ను కేవలం ఓ శృంగార వ‌స్తువుగా చూపించారనే ట్రోల్స్ వచ్చాయి. దీంతో కొన్ని సీన్లను మూవీ నుంచి డిలీట్ చేశారు. ఇప్పుడేమో జాన్వీ కపూర్ ను ఎలివేట్ చేసేలా పెద్ది సినిమాలో కొత్త సీన్లు యాడ్ చేయబోతున్నారు.

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ కు చెందిన రెండు సీన్లు యాడ్ చేయబోతున్నట్లు డ...