భారతదేశం, జూన్ 2 -- Peddi First Review: చాలా కాలం తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక పక్కా రూరల్ స్పోర్ట్స్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'పెద్ది' (Peddi) సినిమా జూన్ 4న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ అమాంతం పెంచేశాయి. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ, ఇన్‌సైడ్ టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారింది.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతోంది. ముఖ్యంగా చరణ్ స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించే సీన్స్ లో యాక్షన్, ఎమోషన్ పీక్స్ లో ఉంటాయట. ఫస్ట్ హాఫ్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే రస్టిక్ సీన్స్, హీరోయిన్...