భారతదేశం, జూన్ 1 -- Peddi Business: రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ మూవీపైనే టాలీవుడ్ మొత్తం ఆశలు పెట్టుకుంది. చాలా రోజులుగా ఓ బ్లాక్‌బస్టర్ కోసం చూస్తున్న ఇండస్ట్రీకి.. ఈ మూవీ మళ్లీ ఊపిరి పోస్తుందని భావిస్తున్నారు.

'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఏకంగా రూ. 218.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్‌ అనిపించుకోవాలంటే డిస్ట్రిబ్యూటర్లు రూ. 220 కోట్ల షేర్ రాబట్టాలి.

పెద్ది మూవీ బిజినెస్ లెక్కలు చూస్తే టార్గెట్ ఎం...