భారతదేశం, జూన్ 5 -- Peddi: ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నుంచి వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది'. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. సినిమాకు వచ్చిన పబ్లిక్ టాక్, పాజిటివ్ బజ్ అడ్వాన్స్ బుకింగ్స్‌ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించింది.

'పెద్ది' సినిమా బుక్‌మైషోలో (BookMyShow) సరికొత్త రికార్డులు సెట్ చేస్తోంది. నిన్న ఒక్కరోజే ప్లాట్‌ఫామ్ మీద గంటకు 40 వేలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయంటే ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమా బుక్‌మైషోలో ఏకంగా 6.53 లక్షల టికెట్ సేల్స్ క్రాస్ చేసి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

సాధారణంగా వీకెండ్స్‌లో మాత్రమే క...