భారతదేశం, జూన్ 1 -- Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' ఆట మొదలైంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ అడ్వాన్స్ టికెట్ సేల్ ఏపీలో స్టార్ట్ అయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 2.07 గంటల నుంచి టికెట్ సేల్ స్టార్ట్ అయింది.

ఏపీలో పెద్ది మూవీ టికెట్ సేల్ స్టార్ట్ అయింది. ప్రముఖ డిజిటల్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ 'డిస్ట్రిక్ట్', 'బుక్ మై షో'లో టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. దీంతో ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు లాంటి కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షో టికెట్లు సోల్డ్ ఔట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రీమియర్ షోలను జూన్ 3న ప్రదర్శిస్తారు.

పెద్ది సినిమాలో గ్రామీణ క్రీడాకారుడిగా రామ్ చరణ్ నటించనున్నాడు. ఇప్పటికే ...