భారతదేశం, అక్టోబర్ 21 -- Payal Rajput: సోషల్ మీడియా వేదికగా తన శరీరాకృతిపై వస్తున్న అసభ్యకర కామెంట్లు, వైరల్ అవుతున్న వీడియోలపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఎక్స్ (ట్విట్టర్)లో విరుచుకుపడింది. బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్న నెటిజన్లకు ఆమె గట్టిగా బుద్ధి చెప్పింది.

మంగళవారం (అక్టోబర్ 20) అర్ధరాత్రి దాటిన తర్వాత పాయల్ రాజ్‌పుత్ తన ఎక్స్ అకౌంట్లో పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది.

"మీకు సిగ్గుండాలి. నా శరీరం గురించి అసహ్యకరమైన కామెంట్లు చేస్తూ, ఆ వీడియోలను షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ సిగ్గుండాలి. నా శరీరం, నా సైజ్, నా గర్వం. ఇవి మీ చర్చలకు, మీ అభిప్రాయాలకు లేదా మీ అశ్లీలతకు సంబంధించిన విషయాలు కావు. మీ పరిధిలో మీరు ఉండండి, మీ పని మీరు చూసుకోండి" అని పాయల్ పోస్టు చేసింది.

పాయల్ తాజా పోస్టు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల హీరోయిన్ల బా...