భారతదేశం, మార్చి 25 -- Pawan Kalyan Wife: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో సాధారణంగా తన సినిమాలకు లేదా రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాత్రమే పంచుకుంటారు. ఆయన పర్సనల్ విషయాలను, ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను బయటపెట్టడం చాలా అరుదు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా (ఇప్పుడు అన్నా కొణిదెల) కు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆమె అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేయడంతో, పవన్ స్వయంగా ఒక పోస్ట్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

"ప్రియమైన అన్నా కొణిదెల, ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచంలోకి నీకు హృదయపూర్వక స్వాగతం. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతున్న నీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ రాకతో ఇక్కడ ఎన్నో స్పూర్తిదాయకమైన, అర్థవంతమైన చర్చలు జరుగు...