భారతదేశం, ఏప్రిల్ 8 -- Pawan Kalyan Son: నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబానికి నేడు (ఏప్రిల్ 8) అత్యంత భావోద్వేగపూరితమైన రోజు. పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ నేడు తన 22వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అయితే అదే సమయంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పవన్ భార్య అన్నాలెజినోవా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విషయాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.

తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లో అన్నా తన ఇద్దరు కుమారుల గురించి ప్రస్తావించింది. "నేడు మా కుటుంబానికి చాలా ఎమోషనల్ డే. అకిరా పుట్టినరోజు.. తను ఎదుగుతున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. అదే సమయంలో సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు అగ్నిప్రమాదంలో మార్క్ ప్రాణాలు కోల్పో...