భారతదేశం, ఆగస్టు 1 -- Pawan Kalyan On Modi: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఈ వేదికగా ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఎయిర్ పోర్ట్ ఓపెనింగ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆకాశానికెత్తారు. ఇటీవల జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ప్రస్తావిస్తూ.. మోదీని మాటలు అంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని పవన్ పేర్కొన్నారు.

''ప్రధాన మంత్రిని చాలా మంది అనకూడని మాటలు అంటుంటే నాకు కన్నీళ్లు వచ్చాయి. దేశం కోసం కష్టపడేవాళ్లకు ఇదా చివరకు మనం ఇచ్చేది? ఆయన పడ్డ కష్టం ఎవర...