భారతదేశం, సెప్టెంబర్ 2 -- Pawan Kalyan Fan Death: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమలాపురంలోని ఒక కాలేజీ సమీపంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్స్ బ్యానర్ కడుతున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై బెండముర్లంక గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ప్రేమ్ కుమార్, తన అభిమాన కథానాయకుడి పుట్టినరోజును ఊరిలో స్నేహితులతో కలిసి గ్రాండ్‌గా జరుపుకోవాలని సొంతూరుకు వచ్చాడు. కానీ ఇలా ఊహించని ప్రమాదంతో అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు భారీ స్థాయిలో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఇందులో ...