భారతదేశం, నవంబర్ 10 -- తెలుగు చలనచిత్ర రంగాన పవర్ స్టార్‌గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధినేతగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువుదీరిన పవన్ కళ్యాణ్ మళ్లీ వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన కొత్త సినిమా విశేషాలు లేదా రాజకీయ వేదికలపై సంచలన ప్రసంగాల కోసం కాదు; తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయంతో వార్తల్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నెవా (అన్నా కొణిదెల) నుంచి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 13 ఏళ్ల పాటు సాగిన వీరి వివాహ బంధం ముగిసిందంటూ ఇరువురూ కలిసి ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

పవన్ కళ్యాణ్​కు అన్నా లెజ్నెవా మూడో భార్య అన్న విషయం తెలిసిందే.

తమ బంధం ముగింపుపై పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.

"మా...