భారతదేశం, ఏప్రిల్ 14 -- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పాలనలో బిజీగా ఉంటూనే, మరోపక్క తన పెండింగ్‌లో ఉన్న సినిమా ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన సినిమాల భవిష్యత్తుపై అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధతకు ఇప్పుడు తెరపడుతోంది. ముఖ్యంగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించబోయే సినిమా పనులు ఊపందుకున్నాయి.

సాధారణంగా ఏదైనా సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ లేదా జూబ్లీహిల్స్ కేంద్రంగా జరుగుతుంటాయి. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విజయవాడ, మంగళగిరి వేదికగా తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర బాధ్యతల దృష్ట్యా ఆయన తరచుగా హైదరాబాద్ రావడం కుదరని పని. అందుకే దర్శకుడు సురేందర్ రెడ్డి ఒ...