భారతదేశం, ఏప్రిల్ 16 -- Pawan Kalyan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోకాలికి సర్జరీ అయిన సంగతి తెలిసిందే. బరి సినిమా షూటింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ మోకాలికి గాయమైంది. దీంతో సర్జరీ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆపరేషన్ చేయించుకున్న వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆశించారు. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిన్నన్న నాగబాబు కొడుకే వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ కు సర్జరీ జరిగిందని తెలిసి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

''యువ కథానాయకుడు వరుణ్ తేజ్ 'బరి' సనిమా షూటింగ్ కోసం చేస్తున్న ప్రాక్టీసులో గాయపడ్డారని తెలిసింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. వైద్యులు, ఫిజియోల సూచనలు పాటిస్తూ కోలుకొని, కెమెరా ముందుకు రావాలి'' అని ఓ ప్రకటనలో ఏపీ డిప్యూటీ సీ...