భారతదేశం, మే 16 -- Pavala Syamala: వెండితెరపై వందలాది సినిమాల్లో తనదైన నటనతో, హాస్యంతో ప్రేక్షకులను నవ్వించిన సీనియర్ సహాయ నటి పావలా శ్యామల జీవితం అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమె పరిస్థితి ఇప్పుడు మరింత ఆందోళనకరంగా మారింది.

శుక్రవారం (మే 15) రాత్రి ఆమెకు గుండె సంబంధిత సమస్య తీవ్రమవడంతో చికిత్స కోసం కూకట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే చేతిలో తగినంత డబ్బు లేదనే కారణంతో సదరు ఆస్పత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించిందని ఆరోపణలు వస్తున్నాయి.

కనీసం మానవత్వం కూడా చూపకుండా ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చికిత్స అందించకపోగా పావలా శ్యామలను అక్కడి నుంచి పంపించివేశారు. ఆ తర్వాత మరింత అమానుషమైన ఘటన జరిగి...