భారతదేశం, జూలై 28 -- Pavala Shyamala: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటులు తమదైన ముద్ర వేసి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి విలక్షణమైన క్యారెక్టర్ ఆర్టిస్టులలో సీనియర్ నటి పావలా శ్యామల ఒకరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మంగళవారం (జూలై 28) అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూశారు.

కొన్నేళ్లుగా అనారోగ్యంతో పావలా శ్యామల పోరాటం చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 70 సంవత్సరాలు. ఆమె మరణవార్త విని టాలీవుడ్ తీవ్ర షాక్ కు గురైంది.

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేరిన పావలా శ్యామలకు వైద్యులు నిరంతరం చికిత్స అందించారు. అయితే మంగళవారం రాత్రి 1:52 గంటల ప్రాంతంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు (Cardiac Arrest) రావడంతో మరణించినట్...