భారతదేశం, ఏప్రిల్ 17 -- Patralekhaa: ప్రసవం తర్వాత పెరిగిన బరువుపై (Postpartum weight) కొందరు పాపరాజీలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి, నిర్మాత పత్రలేఖ తీవ్రంగా మండిపడింది. తన భర్త రాజ్‌కుమార్ రావుతో కలిసి బయటకు వచ్చిన సమయంలో ఆమె చాలా లావుగా కనిపించడాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై ఆమె ఘాటుగా స్పందించింది.

ఇటీవల పత్రలేఖ తన భర్త రాజ్‌కుమార్ రావుతో కలిసి ఒక ఈవెంట్‌కు వెళ్లగా, ఒక పాపరాజీ పేజీ ఆమె వీడియోను షేర్ చేస్తూ.. "ఈమెకు ఏమైంది?" (What's happened to her?) అనే క్యాప్షన్ ఇచ్చింది. పెరిగిన బరువును ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై పత్రలేఖ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చింది.

"నాకేమైంది అని అడుగుతున్నారా? నేను ఇప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చాను! అవును నేను బరువు పెరిగాను. ఇది మీకందరికీ ఏదో వింతైన విషయంగా అన...