భారతదేశం, జూన్ 1 -- Paradise: ఆయా షేర్ అంటూ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. అతను హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ 'ప్యారడైజ్'. దీనికి శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్. నానితో దసరా లాంటి మాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల్.. ఇప్పుడు అంతకుమించి రా అండ్ రస్టిక్ గా ప్యారడైజ్ ను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ నుంచి లేటెస్ట్ బజ్ ఒకటి తెగ వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవికి శ్రీకాంత్ ఓదెల బిగ్ ఫ్యాన్. సినిమా అంటే చిరంజీవిదేనని, హీరో అంటే మెగాస్టార్ అనే నమ్మే అభిమాని అతను. ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు ప్యారడైజ్ మూవీలో చిరంజీవితో క్యామియో కూడా ప్లాన్ చేశాడనే టాక్ చక్కర్లు కొడుతోంది.

మెగాస్టార్ చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల్ కాంబినేషన్లో ఇప్పటికే ఓ మ...