భారతదేశం, నవంబర్ 18 -- Panchayat Season 5 OTT Release: ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'పంచాయత్' మళ్లీ సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ బ్లాక్‌బస్టర్ సిరీస్ ఐదో సీజన్ విడుదల తేదీని బుధవారం (నవంబర్ 18) అధికారికంగా ప్రకటించింది.

జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'పంచాయత్ సీజన్ 5' డిసెంబర్ 3, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వచ్చే ఏడాది వరకు వేచి చూడాలన్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ ఏడాదే ఫులేరా గ్రామంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేందుకు మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బుధవారం ప్రైమ్ వీడియో తన సోషల్ మీడియా ఖాతాల్లో 'పంచాయత్ 5' కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను వెల్లడించింది. ఈ పోస్టర్‌లో కొత్త ప్రధాన్ భర్త భూషణ్ అలియాస్ బ...