భారతదేశం, జూన్ 23 -- Padma Awards 2026: దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల (Padma Awards) ప్రదానోత్సవం మంగళవారం (జూన్ 23) సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో నిర్వహించిన రెండవ సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకలో సినీ, సంగీత, నాటక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు.

ఈ ప్రతిష్టాత్మక వేడుకలో మలయాళ లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి, ప్రముఖ సింగర్ అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అందుకోగా.. వర్సటైల్ యాక్టర్ ఆర్‌ మాధవన్ పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు.

74 ఏళ్ల మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి విశిష్ట ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూ...