భారతదేశం, జూలై 3 -- OTT Weekend: ఈ వీకెండ్ హోమ్ థియేటర్లలో వినోదాల జాతర షురూ కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లాంటి టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త సినిమాలతో రెడీ అయ్యాయి. సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు' దెబ్బకు కడుపుబ్బా నవ్వాల్సిందే.

దీంతోపాటు తెలుగులోనే ఇసకపట్నం రూపంలో మరో క్రైమ్ థ్రిల్లర్ రెడీగా ఉండగా.. మలయాళంలోనూ చాలానే థ్రిల్లర్, కామెడీ జానర్లలో సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నెట్‌ఫ్లిక్స్ లోకి సూపర్ సుబ్బు అనే వెబ్ సిరీస్ తో వచ్చేశాడు. జులై 2 నుంచే స్ట్రీమింగ్ మొదలైంది. ఒక సాంప్రదాయబద్ధంగా ఉండే గ్రామంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా వెళ్లిన ఒక కుర్రాడి కథ ఇది. నవ్వులు గ్యారెంటీ. మిథిలా పాల్కర్, మురళీ శర్మ కూడా ఇరగదీశారు.

ప్రైమ్ వీడియోలోకి ఈ వారం వచ్చిన తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్...