భారతదేశం, జనవరి 20 -- ఓటీటీని షేక్ చేస్తోంది తెలుగు యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ 'జిగ్రీస్'. నలుగురు ఫ్రెండ్స్ ట్రిప్ కథతో తెరకెక్కిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. ఈ మూవీకి సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సపోర్ట్ గా నిలిచారు. ఇప్పుడు ఒకేసారి రెండు ఓటీటీల్లో ఉన్న ఈ తెలుగు మూవీ హాట్ టాపిక్ గా మారింది.

పాత మారుతి 800 కార్లో గోవా ట్రిప్ వెళ్లే నలుగురు ఫ్రెండ్స్ స్టోరీతో తెరకెక్కిన మూవీ జిగ్రీస్. ఇది నవంబర్ 14, 2025న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ తదితరులు నటించారు. ఈ మూవీ ఇప్పుడు సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

జిగ్రీస్ మూవీ ఇప్పుడు ఓటీటీ ట్రెండింగ్ లో అదరగొడుతోంది. ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సత్తాచాట...