భారతదేశం, మే 9 -- OTT Trending: ఓటీటీలో తెలుగు సినిమాల జోరు కొనసాగుతోంది. లేటెస్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన అడివి శేష్ రొమాంటిక్ థ్రిల్లర్ 'డెకాయిట్' మూవీ అదరగొడుతోంది. ఓటీటీలో ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. డిజిటల్ ఆడియన్స్ ను భలే ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ మూవీని మీరు చూశారా? లేదంటే వెంటనే ఓ లుక్కేయండి.

అడివి శేష్, మృణాల్ ఠాకూర్‌ జంటగా నటించిన లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ 'డెకాయిట్'. థియేటర్లో అదరగొట్టిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఈ మూవీ మే 8న ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ గా 'డెకాయిట్' దూసుకెళ్తోంది. ఓటీటీలోకి వచ్చిన ఒక్కరోజులోనే మిగతా సినిమాలను వెనక్కి నెట్టి డెకాయిట్ అదరగొడుతోంది. ఈ మూవీని జనాలు త...