భారతదేశం, ఫిబ్రవరి 20 -- సాధారణంగా ఓ సినిమా ఒకే ఓటీటీలోకి.. లేదంటే రెండు ఓటీటీల్లోకి రావడం చూశాం. మరీ అరుదుగా మూడింట్లోనూ స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ హాట్ స్పాట్ 2 మచ్ అనే ఈ మూవీ మాత్రం ఒకే రోజు ఆరు ఓటీటీల్లోకి వచ్చింది. చాలా బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ జనవరి 23న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే అంటే ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20) నుంచే స్ట్రీమింగ్ మొదలైంది.

విగ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన తమిళ మూవీ 'హాట్ స్పాట్ 2 మచ్' (Hot Spot 2 Much). తమిళ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలతో, ముఖ్యంగా బోల్డ్, కాంట్రవర్షియల్ అంశాలతో సినిమాలు తీసే దర్శకుడిగా ఇతనికి పేరుంది. అతడు గతంలో అంటే 2024లో తీసిన 'హాట్ స్పాట్' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన తాజా మూవీ 'హాట్ స్పాట్ 2 మచ్'. ఇప్పుడీ సినిమా ఈరోజు నుంచి ఏకంగా ఆరు ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అం...