భారతదేశం, ఆగస్టు 22 -- OTT Thrillers: మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ కథలంటే మీకు ఇష్టమా? అయితే పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar)లో అద్భుతమైన సినిమాలు అందుబాటులో ఉన్నాయి. సైకలాజికల్ థ్రిల్లర్స్ నుంచి ఇన్వెస్టిగేటివ్ డ్రామాల వరకు, చివరి క్షణం వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే టాప్ 6 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల వివరాలు ఇక్కడ చూద్దాం.

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 'అంధాధున్' ఒక అద్భుతమైన డార్క్ కామెడీ సైకలాజికల్ థ్రిల్లర్. తన సంగీత నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం అంధుడిగా నటిస్తుంటాడు ఆకాష్ (ఆయుష్మాన్ ఖురానా). అయితే అనుకోకుండా ఒక రిటైర్డ్ నటుడి హత్యను కళ్లారా చూస్తాడు.

ఆ హత్య వెనుక సదరు నటుడి భార్య సిమి (టబు), ఆమె ప్రియుడు ఉంటారు. ఈ సంఘటన తర్వాత ఆకాష్ జీవితం తీవ్రమైన ప్రమాదంలో పడుతుంది. ప్రతి సన్నివేశంలో ఊహించని మలుపులతో సాగే...