భారతదేశం, ఫిబ్రవరి 27 -- క్షణక్షణం ఉత్కంఠ పెంచుతూ, సీన్ సీన్ కు థ్రిల్ అందిస్తూ సాగే సినిమాలు, సిరీస్ లకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంటుంది. థ్రిల్లర్లను డిజిటల్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఈ ఓటీటీ లవర్స్ కు అదిరే ట్రీట్ అందించడానికి ఒకే రోజు అటు మలయాళం, ఇటు తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు వచ్చేశాయి.

రాజీవ్ కనకాల ఓ వైపు సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూనే, ఓటీటీల్లోనూ వచ్చే సిరీస్ ల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజీవ్ మరోసారి లీడ్ రోల్ ప్లే చేసిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ఈ తెలుగు సస్పెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇవాళ (ఫిబ్రవరి 27) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో తెలుగులో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు వెబ్ సిరీస్ ప్రసాద్ రావు (రాజీవ్ ...