భారతదేశం, అక్టోబర్ 21 -- OTT Thriller: మీకు పురాతన రహస్యాలు, దేవుళ్లు-దేవతలకు సంబంధించిన నమ్మకాలు, మిస్టరీ మరణాలు, సైన్స్ వర్సెస్ మూఢనమ్మకాల నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూడటం ఇష్టమా? అయితే ఓటీటీలో మీకోసం ఒక సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్ సిద్ధంగా ఉంది. అక్కినేని హీరో సుమంత్ కథానాయకుడిగా దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన లేటెస్ట్ డివోషనల్ థ్రిల్లర్ మూవీ 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Vaaraahi).

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలైన తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టి, ఐఎండీబీ (IMDb)లో 7.9 రేటింగ్ సాధించి ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. రాజ కుటుంబానికి 200 ఏళ్ల నాటి దైవ శాపం, రహస్య మరణాల నేపథ్యంలో నడిచే ఈ ఉత్కంఠభరితమైన కథాంశం థ్రిల్లర్ లవర్స్‌ను ...